Friday, 25 September 2026 11:21:05 PM

కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కుంగిందో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే...

బీఆర్ఎస్ భవిష్యత్తుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని కీలక వ్యాఖ్యలు

Date : 04 March 2024 06:39 PM Views : 746

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఖమ్మం జిల్లా : బీఆర్ఎస్ భవిష్యత్తుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో తెలంగాణ సెంటిమెంట్ లేదన్నారు.కారు పార్టీ నిలబడటమే కష్టంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కుంగిందో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే అన్నారు. కమ్యూనిస్టులు ఉంటేనే ఇండియా కూటమికి స్ట్రెంత్ అని తమకు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానామైన ఇవ్వాలని డిమాండ్ చేశారు. నల్లగొండ, ఖమ్మం, పెద్దపల్లి, భువనగిరి, వరంగల్ స్థానాలను కావాలని అడిగినట్లు కూనంనేని క్లారిటీ ఇచ్చారు.కమ్యూనిస్టులు ఏకంగా కావాలని.. రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో సత్తాచాటాలని పిలుపునిచ్చారు. ఖమ్మం మొదటి నుంచి కమ్యూనిస్టుల కంచుకోట అని.. తక్కువ ఓట్లు వచ్చాయని సీపీఎంను తక్కువ అంచనా వేయలేమన్నారు. ప్రజాపంథా ఆధ్వర్యంలో విప్లవ పార్టీలు ఏకంగా కావడం శుభపరిణామన్నారు. కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్తులో స్నేహం కొనసాగుతుందని కూనంనేని స్పష్టం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :