Saturday, 26 September 2026 07:23:50 AM

తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తాం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Date : 27 October 2023 06:55 PM Views : 446

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు సూర్యాపేటలో బీజేపీ ఎన్నికల భారీ బహిరంగ సభ నిర్వహిచింది. ఈ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘దళితుడిని సీఎం చేస్తామని చెప్పే ధైర్యం కేసీఆర్‌కు ఉందా? బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం. బీజేపీని గెలిపిస్తే బీసీ నేతను సీఎం చేస్తాం. తెలంగాణకు BRS, కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు. BRS, కాంగ్రెస్‌కు కుటుంబ రాజకీయాలే ముఖ్యం. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం. రాహుల్‌గాంధీను పీఎం చేయడమే సోనియా లక్ష్యం. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం’’ అని అమిత్‌షా తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :