Thursday, 24 September 2026 09:35:01 PM

మంచి నీళ్ల కోసం ఖాళీ బిందెలతో మహిళల నిరసన ...

Date : 03 November 2024 11:41 AM Views : 618

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నల్లగొండ జిల్లా : మంచి నీళ్ల కోసం ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపే దుస్థితి నెలకొంది. తా మిషన్ భగీరథ నీళ్ల కోసం నల్లగొండ జిల్లాలోని చెన్నారం గ్రామంలో నెల రోజులుగా తాగునీరు రాకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానిక వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల రోజులుగా ఇబ్బంది పడుతున్నా, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. మహిళల ఆందోళనతో నల్లగొండ- కనగల్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :