ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / యైటింక్లెయిన్ కాలనీ (గోదావరిఖని) : విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ అన్నారు.స్థానిక స్పందన మోడల్ స్కూల్లో ఇటీవల హైదరాబాద్ ఐఐటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఐఐటి గ్రాండ్ టెస్ట్-1లో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టేందుకు విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదలతో ప్రయత్నం చేయాలని సూచించారు.విద్యతో పాటు ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టుకొని క్రమం తప్పకుండా ప్రతిరోజు యోగ, వాయాయం చేయాలని పిలుపునిచ్చారు. ఐఐటీ గ్రాండ్ టెస్ట్ లో మొదటి ర్యాంకు రెండో ర్యాంకు సాధించిన 9వ తరగతి చెందిన నిజాముద్దీన్, వైష్ణవి, 8వ తరగతి చెందిన మనశ్విని, శివసాత్విక్ ఏడవ తరగతికి చెందిన యశ్వంత్ ,విష్ణు తేజ, ఆరో తరగతికి చెందిన అశ్విన్ ప్రీతం, మోసం, శ్రీ విష్ని, శ్రీ లాస్య కు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ కార్పొరేటర్ కిషన్ రెడ్డి, పాఠశాల ప్రిన్సి పాల్ రవీందర్ రావు, ఇన్చార్జ్ కె. వనిత ఉపాద్యాయులు రిజ్వానా, మాధవి, కల్పనా, వనిత, సుకన్య, పి ఈ టి హరిత తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News