ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు, జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమతను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిశోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మమతను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా నియమించారు. ఇక కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి అభిలాష అభినవ్ నియామకమయ్యారు.జీహెచ్‌ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి సైతం బదిలీ అయ్యారు. జీహెచ్‌ఎంసీలో శ్రీనివాస్‌రెడ్డి డెప్యూటేషన్‌ను రద్దు చేసింది. చేనేత, జౌళిశాఖ అదనపు డైరెక్టర్‌గా పాతచోటుకే చోటుకే ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక శేరిలింగంపల్లి కొత్త జోనల్ కమిషనర్‌గా ఐఏఎస్ స్నేహ శబరీష్ నియామకమయ్యారు. జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్ ఇంజినీర్ వెంకట రమణను మూసీ నది అభివృద్ధి సంస్థ ఎస్‌ఈగా బదిలీపై పంపింది. ప్రస్తుతం మూసీ అభివృద్ధి సంస్థ ఎస్‌ఈ మల్లికార్జునుడును ఈఎన్‌సీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
Admin
Aakanksha News