ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ గౌతమి నగర్ లోని తన నివాసం నుండి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీని ప్రారంభించారు. ముందుగా సోమారపు సత్యనారాయణ సతీమణి మంగళ హారతులు ఇచ్చి తిలకం దిద్ది ర్యాలీని ప్రారంభించారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు సన్నిహితులు, అభిమానులు జై సోమారపు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సోమవారపు సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజలందరి కోరిక మేరకు ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. ఇప్పటికే నాకు 3 సార్లు అవకాశం కల్పించి సేవ చేసే అవకాశాన్ని ఇచ్చారని అన్నారు. గత ఎన్నికల్లో ఎన్నో కారణాల వల్ల అవకాశాన్ని కోల్పోయానని, పేర్కొన్నారు. చివరిసారిగా మరోసారి ప్రజల కోరిక మేరకు ఎన్నికల బరిలో ఉంటున్నానని తెలిపారు. నాకు ప్రజల ఆశీర్వాదం సహకారం ఉందని మరోసారి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ప్రజలను గెలిపిస్తారని సోమవారం సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. రామగుండం నియోజకవర్గం లో నేను చేసిన అభివృద్ధి పనులు, నీతి నిజాయితీగా పాలన నడిపిన చరిత్ర తనకు ఉందని అన్నారు. నియోజకవర్గంలో ప్రజలందరినీ కలుపుకొని వెళ్లి శాంతియుత వాతావరణంలో పరిపాలన కొనసాగించామన్నారు. ప్రజల అభిష్టానం మేరకే వస్తున్నందుకు ప్రజలు నన్ను ఆదరిస్తారని పేర్కొన్నారు. గతంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో మహాకూటమి ఒకవైపు మరోవైపు చిరంజీవి అభిమానులు మరోవైపు రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో బలమైన కాంగ్రెస్ ఉన్న సమయంలో రామగుండం ప్రజలు నన్ను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించాలని అన్నారు. గతంలో ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత ఓట్లతోనే సోమవారం సత్యనారాయణ గెలిచారని చెప్పారని గుర్తు చేశారు. నా నాయకత్వం మీద నమ్మకం ఉంది కాబట్టే మరోసారి రామగుండం ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారని సోమారపు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News