Thursday, 24 September 2026 08:52:44 PM

కార్మిక క్షేత్రంలో సైలెంట్ రాజకీయం....?

గుట్టుచప్పుడు కాకుండా పావులు కడుపుతున్న ఓ జాతీయ పార్టీ నేత...?

Date : 09 May 2023 09:37 PM Views : 1440

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రాష్ట్ర రాజకీయాలు ఒకలా ఉంటే... రామగుండం రాజకీయాలు మరో విధంగా ఉంటాయి అనడానికి ఎటువంటి సందేహం లేదనే చెప్పవచ్చు. రామగుండం రాజకీయాలలో ఎన్నికల సమయంలో ప్రజల తీర్పు వైవిధ్యంగా ఉంటుంది.. ఈ క్రమంలో ఇక్కడ కార్పొరేషన్ నుంచి పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజల మనసును దోచుకొని వారి మన్ననలు పొందడానికి ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తూ వారి దృష్టిలో పడేవిధంగా ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తారు. అయితే ఇక్కడి ప్రజలు నమ్మిన వ్యక్తికి పట్టం కట్టి విజేతగా నిలబెడతారనే నమ్మకం ఇక్కడ నాయకుల్లో బలంగా ఉంటుంది.. అందుకే ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఇక్కడి రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆయా వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు వారి అనుచరులతో,కార్యకర్తలతో ఎప్పటికప్పుడు వివిధ కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రతిరోజు వారితో సమావేశాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి రాజకీయాల్లో కొంతమంది నేతలు వారి అనుచరులతో కలసి కోవర్ట్ రాజకీయాలను చేస్తారనే ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే ఈసారి జరిగే ఎన్నికలపై ఓ జాతీయ పార్టీ నేత మరోసారి తన సత్తా చాటేందుకు రామగుండంపై గురి పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో మున్సిపల్ తో పాటు ఎమ్మెల్యేగా కీలక పదవిలో కొనసాగిన రామగుండం మేధావిగా పేరున్న ఓ జాతీయ పార్టీ నేత రానున్న ఎన్నికలే టార్గెట్ గా ఇప్పటికే తన అనుచరులతో, కార్యకర్తలతో, తన నమ్మకంగా ఉన్న వారితో ప్రతిరోజు సమావేశాలు నిర్వహిస్తూ చాప కింద నీరుల తన రాజకీయాన్ని విస్తరిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే ప్రస్తుత అధికార పార్టీలో ఉన్న ఓ మహిళ నాయకురాలు ఓ జాతీయ పార్టీ నేతకు మద్దతుగా ఓ గ్రామంలో మహిళ సంఘాలతో, మహిళలతో సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈసారి జరిగే ఎన్నికల్లో మరోసారి సదరు జాతీయ నేతకు అవకాశం ఇవ్వాలని పూర్తిస్థాయిలో మద్దతు తెలపాలని వారి వద్ద నుండి హామీ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతోపాటు మరి కొంతమంది తన నమ్మకమైన అనుచరులు రామగుండం రాజకీయాలను తమ నేతకు అనుకూలంగా విస్తరించుకుంటూ పోతున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ విమర్శలు చేసుకుంటున్న క్రమంలో సదరు ఓ జాతీయ పార్టీ నేత మాత్రం ఇందుకు భిన్నంగా తన మెదడుకు పదును పెట్టి రాజకీయాన్ని విస్తరిస్తున్నట్లు తెలుస్తుంది. ఓవైపు ఇతర పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటే సదరు జాతీయ పార్టీ నేత మాత్రం వారి రాజకీయాలను గమనిస్తూనే తన సత్తా చాటే అందుకు చేసే ప్రయత్నాలు రామగుండం నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో ప్రభావం చూసే అవకాశాలు సైతం లేకపోలేదు. ఇప్పటికే నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో రానున్నా ఎన్నికల్లో జరిగే మార్పులపై అందరిలోనూ ఆసక్తిని నెలకొంటుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :