Saturday, 07 December 2024 01:49:22 PM

బీజేపీకి సోమారపు రాజీనామా...⁉️

రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం...⁉️

Date : 29 September 2023 11:57 AM Views : 2929

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : రామగుండం రాజకీయాలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు అందరినీ అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇతర పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా నిశ్శబ్ద రాజకీయాలను కొనసాగిస్తూన్న మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ అధికారికంగా రేపు బిజెపికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఈ రాజీనామా పత్రాన్ని నేడు కేంద్రమంత్రి బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపించనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఏది ఏమైనా సోమారపు వేసే అడుగులు రామగుండం రాజకీయాల్లో సంచలనం కలిగించబోతున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2024. All right Reserved.

Developed By :