Tuesday, 11 August 2026 03:59:37 PM

వెంటనే రూ.4,500 కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయాలి...

బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్

Date : 04 October 2024 05:22 PM Views : 422

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రాష్ట్రంలో 16 లక్షల మంది బీసీ,ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు చదువుతున్నారని,గత మూడు సంవత్సరాలుగా ఫీజులు చెల్లించక పోవడం మూలంగా పోవడం బకాయిలు రూ.4,500 కోట్లకు పేరుకుపోయాయని వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ ఇంజినీరింగ్ తదితర వృత్తి విద్య కోర్సుల పూర్తి ఫీజు పథకాన్ని పునరుద్దరిం చాలని ఆయన సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఫీజు బకాయిలు చెల్లించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ చార్జీలు, స్కాలర్షిప్స్ పెంచాలని, 6 నెలల నుంచి విద్యా ర్థులు పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన విమర్శించారు. విద్యార్థుల ఫీజు బకాయిలకు సంబందించి బడ్జెట్ విడుదలచేయకపోతే ఎక్కడికక్కడ మంత్రులు, ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని అలాగే రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. మూసీ సుందరీకరణకు రూ. లక్షా 50వేల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం విద్యార్థుల చదువుపై రూ.4,500 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎందుకు వెనకాడుతోందని గుజ్జ సత్యం ప్రశ్నించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కాలేజీ యాజమా న్యాలు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉన్నత కోర్సుల్లో సీటు వచ్చినా చదవలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలకు ఎంపికైనా సర్టిఫి కెట్లు లేక ఉద్యోగాలు కోల్పోతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల ఫీజు బకాయిలు, మెస్ చార్జీలు, స్కాలర్షిప్స్, విడుదల చేయాలని ఆయన కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :