ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : దోపిడీ దొంగలకు,తెలంగాణ వ్యతిరేకులకు బిఆర్ఎస్ పెద్ద పీట వేసిందని,లక్షల కోట్లు కేటీఆర్ దండుపాళ్యం ముఠా దోచుకుందని టిపిసిసి జనరల్ సెక్రటరీ పున్న కైలాష్ నేత ఆరోపించారు. గురువారం గాంధి భవన్ లలోమీడియా సమావేశం లో మాట్లాడుతూ కేటీఆర్ నాయకత్వంలోనేడు సురభి నాటక మండలి వేసే నాటకాలు వేస్తున్నారని విమర్సహించారు.మీ పదేళ్ల పాలన.. ఏడాది రేవంత్ రెడ్డి ప్రజా పాలన మీద చేసిన సంక్షేమ అభివృద్ధి మీద చర్చ చేయండని సవాలక్ విసిరారు.పదేళ్లలో ఎక్కడ నిరసన తెలిపిన అక్రమంగా అరెస్టు చేశారు.కోళ్ళ షెడ్లల్లో పాఠశాలలు నడిపారు.కానీ రేవంత్ రెడ్డి 21100 కోట్ల బడ్జెట్ ను విద్యకు కేటాయించించారన్నారు.రెసిడెన్షియల్ పాఠశాలలకు శంకుస్థాపనలు చేసుకున్నాం.దోపిడీ దొంగలకు,తెలంగాణ వ్యతిరేకులకు పెద్ద పీట వేసింది మీరు.లక్షల కోట్లు కేటీఆర్ దండుపాళ్యం ముఠా దోచుకుంది మేరు అని అన్నారు..రైతుల సంక్షేమం కోసం పాలన కొనసాగుతుంది.తెలంగాణ మహిళలు బస్సుల్లో ప్రయాణించే 3వేల కోట్లు అదా చేసుకున్నారు.నిన్న రాత్రి పది గంటలకు కేటీఆర్ ఇంట్లో విద్యార్థి నాయకులతో సమావేశం అయ్యి.. ప్రభుత్వం కి చెడ్డ పేరు తేవాలని కుట్ర చేసింది నిజం కదా.పదేళ్లు ప్రజాస్వామ్యంలో ఉండి.. నీచ రాజకీయాలకు వ్యూహరచన చేస్తున్నారు.హింస జరిగి పోలీస్ లాఠీ ఛార్జ్ జరగాలని చూస్తున్నారు.కేటీఆర్ కి ధైర్యం ఉంటే.. కలెక్టరేట్ల ముట్టడి నువ్వు చెయ్.విద్యార్థి నాయకులను ఉసిగొల్పడం కాదు.ప్రభుత్వ టర్మ్ లోపు తప్పక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం.జైలు నుంచి కవిత విడుదల కోసం అమిత్ షా కు కప్పం కట్టారని ఆరోపించారు.
Admin
Aakanksha News