ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : 12వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఓ అవినీతి రెవిన్యూ అధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... గత నేల 27వ తేదీన లింగాపూర్ నుండి అంతర్గంకు అలకుంట మహేష్ అనే వ్యక్తి ఇసుక తరలిస్తుండగా అంతర్గం ఎస్.ఐ వెంకటస్వామి పట్టుకొని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దీనికి 25 వేల రూపాయల జరిమానా విధించడంతో ఈ నేల 14వ తేదీన మహేష్ జరిమానాను కట్టారు. అయితే పట్టుకున్న ట్రాక్టర్ ను రిలీజ్ చేయడానికి ఆర్.ఐ శ్రీధర్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆర్.ఐ వేధింపులు భరించలేక మహేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు బాధితుడి నుండి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు ఆర్ఐని పట్టుకున్నారు. దీనిపై ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం లంచం తీసుకున్న ఆర్ఐ పరారీలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Admin
Aakanksha News