ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాల భర్తీ కై నోటిఫికేషన్లు15 రోజులలో జారీ చేయాలనీ లేని పక్షంలో పెద్దఎత్తున రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతామని జాతీయ బీ.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్. కృష్ణయ్య హెచ్చరిoచారు. ఈ రోజు విద్యానగర్ బీసి భవన్ లో ఉస్మానియా, కాకతీయ, తెలంగాణా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు – నిరుద్యోగ సంఘంలలో నాయకులు సమావేశం అయ్యారు. ఇదిగో- అదిగో నోటిఫికేషన్లు అంటూ 14 నేలల నుంచి నిరుద్యోగులకు ఆశలు కల్పిస్తున్నారు. జోనల్ విధానం పూర్తి అయ్యoది. ఉద్యోగాల కేటాయింపు పూర్తి అయ్యoది. నోటిఫికేషన్లుకు ఎలాంటి చట్టపరమైన, న్యాయపరమైన పరిపాలనపరమైన అవరోదాలు లేవు. కానీ ప్రభుత్వం ఉద్దేశ్యపుర్యకగా జాప్యం చేస్తుందని ఆయన ఆరోపించారు.ఈ సమావేశంలో నిరుద్యోగ జేఏసి చైర్మన్ నీల వెంకటేష్, ప్రభాకర్, పి. బ్రహ్మయ్య, జి. రాజ్యలక్ష్మి, వెంకటేష్ తదితరులు ప్రసంగిచారు.
Admin
Aakanksha News