Monday, 10 August 2026 01:02:18 PM

వెంటనే రూ.5 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి..

బిజెపి ఎంపి ఈటల రాజేందర్ డిమాండ్

Date : 30 January 2025 04:49 PM Views : 515

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. . వెంటనే రూ.5 వేల కోట్లు రిలీజ్‌ చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.సర్కార్ తీరుతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద బీసీ విద్యార్థుల సమర శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల సమావేశానికి ఎంపి ఈటల రాజేందర్‌ హాజరై మద్దతు తెలిపారు.ఫీజులు చెల్లించలేక, సర్టిఫికెట్లు రాక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో 14 లక్షల కుటుంబాల్లో శాంతి లేకుండా చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారువిద్యార్థుల సమస్యల పరిష్కారానికి బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని ఈటల చెప్పారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :