ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : రెండు లారీలు డీ కొని ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే... గోదావరిఖని ఎన్టీపీసీ బీ టైప్ గేట్ వద్ద బూడిద లారీ పంచర్ కావడంతో అక్కడే నిలిపి వేసి డ్రైవర్ వెళ్ళిపోయాడు. అయితే కొత్తగూడెం నుండి గోదావరిఖని వైపు వస్తున్న బొగ్గు లారీ తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో డీ కోనడంతో క్లినర్ పుసాల రాజేశ్వర్ రావు లారీల మధ్యలో క్యాబిన్ లో ఇరుక్కు పోవడంతో స్థానికులు 108కు సమాచారం అందించగా అక్కడికి చేరుకొని రెస్క్యు సిబ్బందితో కలసి మూడు గంటల పాటు శ్రమించి క్యాబిన్ లో నుండి క్లినర్ ను బయటకు తీశారు. అయితే క్లినర్ పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైనా వైద్యం కోసం కరీంనగర్ కు తరలించగా స్వల్ప గాయాలైన బొగ్గు లారీ డ్రైవర్ నూతి వెంకట్ ను స్థానిక జనరల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Admin
Aakanksha News