ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సిద్దిపేట జిల్లా : తెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇటీవలే పెద్దలను ఎదురించి ప్రేమించి పెళ్లి చేసుకున్న శృతిని కట్నం కోసం అత్తింటి వారే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.చిన్నతనం నుంచి గాయని కావాలని బలమైన కోరిక ఉన్న శృతి ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్‌గా మంచి పేరు సంపాదించుకుంది.ఈ క్రమంలో ఆమెకు సిద్ధిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమయ్యాడు. ఈ పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారి తీయడంతో 20 రోజుల క్రితమే రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత శృతిని దయాకర్ ఇంటికి తీసుకెళ్లి అమ్మా నాన్నలకు పరిచయం చేశాడు. ఎంతో సంబురంగా అత్తింట్లో అడుగుపెట్టిన శృతికి అప్పటి నుంచి కట్నం కోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కట్నం తీసుకురావాలని అత్తమామలు శృతి వేధించారని తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా కట్నం కోసం వేధిస్తూ కాలయముడుగా మారాడని ఆరోపిస్తున్నారు.ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నుంచే ఈ వేధింపులకు గురి కావడంతో తట్టుకోలేని శృతి.. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. తన కూతురును భర్త, అత్తమామలే చంపారని శృతి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Admin
Aakanksha News