ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : బీఆర్ఎస్ పార్టీ 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్యకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఉండడంతో ప్రజలు హాజరయ్యారు. అయితే సభ ముగిసిన అనంతరం తమ వాహనాల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు వెళ్తున్న సమయంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుండి 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య వెళ్తున్న క్రమంలో ఇరు వాహనాలు ఎదురెదురుగా వచ్చాయి. అయితే సదురు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మక్కాన్ సింగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఒక్కసారిగా ఆలోచన మొదలైంది. దీంతో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఘర్షణను చదరగొట్టారు
Admin
Aakanksha News