ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జోగులంబ గద్వాల జిల్లా : బీసీ ఆత్మీయ బంధువులకు జోగులాంబ గద్వాల జిల్లా బి సి సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్ బహిరంగ లేఖ రాశారు.తెలంగాణలో ఇటీవల జరిగిన 'బీసీ కుల గణన సర్వే' తప్పులతడకగా ఉన్న విషయం తెలిసిందే. ఫలితంగా పెద్ద ఎత్తున 'బీసీ కుల గణన యుద్ధం' జరుగుతున్న సంగతి అందరూ చూస్తున్నదే.ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న "బీసీ కుల గణన ఉద్యమాలను అణిచివేసేందుకు 'కొందరు పెద్దలు' ప్రయత్నాలు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు, ప్రజల దృష్టిని దారిమళ్లించేందుకు రాష్ట్రంలో రకరకాల సంఘటనలను తెరపైకి తీసుకురాబోతున్నారని తట్టే మహేష్ హెచ్చరించారు.అయిందానికి..కాని దానికేమో ఇందిరా పార్క్ లు, స్టేడియాల్లో మీటింగులు.. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు, సైకిల్ యాత్రలు, పాదయాత్రలు చేసిన విషయం తెలిసిందే. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, బీసీలపై అణిచివేతలు ఇప్పటి మరియు రాబోయే కొన్ని తరాలనే కాలరాయనున్నాయి.ఓ రెండు నెలలు ఆలస్యమైనా పర్వాలేదు..అధికార యంత్రాంగం స్థానిక బీసీ మరియు కుల సంఘాల సమన్వయంతో ఇంటింటికీ తిరిగి పారదర్శకతతో 'బీసీల కుల గణన సర్వే' చేపట్టాలి.. అప్పటి వరకూ 'బీసీల ఉద్యమం' ఆపకూడదు. ఉద్యమాన్ని నీరుగార్చే శక్తులు, ఉద్యమ ద్రోహుల గురించి "తెలంగాణ ఉద్యమ తెలంగాణ ముద్దుబిడ్డ బి సి జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు R కృష్ణయ్య అన్న ఎంపీ " మీకు ఎప్పటి మీ వెంట ఉంటూ తెలంగాణ ఉద్యమానికి వెన్నెముక అయిన తెలంగాణ బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఎంపీ .తెలంగాణ భవిష్యత్ తరాల బాగు కోసం మీతో ఉద్యమిస్తారు. ఉద్యమిస్తూనే ఉంటారుఇప్పుడు కాకుంటే..ఎప్పుడూ కాదు..మన యుద్ధం మనమే చేయాలి..ఉద్యమం మనదే..విజయమూ మనదే! అని తట్టే మహేష్ పేర్కొన్నారు.
Admin
Aakanksha News