ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : వివిధ శ్మశాన వాటికలో గ్యాస్‌తో దహన సంస్కారాలు చేయడం ఒక ప్రక్రియ. ఇలాంటి గ్యాస్‌తో దహన సంస్కారాలు చేసేందుకు గోదావరిఖనిలో నగర పాలక సంస్థ గతంలోనే స్మశానవాటికలో ఎల్‌పీజీ డబుల్ బర్నర్ క్రిమిటోరియంను నిర్మించారనీ, అది ప్రారంభం కాకముందే తుప్పు పడుతుందని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం శ్మశాన వాటికలోనీ గ్యాస్ విద్యుత్ దహన సంస్కారాలు యంత్రాన్ని పరిశీలించారు. అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ. ఇట్టి యంత్రాన్ని గతంలోనే దాదాపు రూ.30 లక్షలతో నిధులు మంజూరు చేసి కొనుగోలు చేశారని దిని షెడ్డు కొరకు 60లక్షల నిధులతో నిర్మించి వృధాగా వదిలేశారని దాదాపు 90 లక్షల నుండి కోటి రూపాయల ప్రజాధనాన్ని వృదా చేశారని వారు ఆరోపించారు.దహన సంస్కారాల యంత్రం కనీసం ప్రారంభానికి నోచుకోకుండనే తుప్పు పట్టి శిధిలావస్థకు చేరుకుందని దీనిని నగరపాలక సంస్థ ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని అయిన విమర్శించారు.సాధారణంగా ఎవరైనా వ్యక్తులు చనిపోయినప్పుడు కట్టెలను కాడుగా పేర్చి దహన సంస్కారాలు చేసే ప్రక్రియ సాధారణంగా జరుగుతుందని ముందు చూపుతో రామగుండం నగర పాలక సంస్థ దాదాపు పదేళ్ళ క్రితమే మోడ్రన్‌గా ఎలక్ట్రికల్ క్రిమిటోరియం ద్వారా దహన సంస్కారాల యంత్రం ఏర్పాటు చేయడం మంచిదైనప్పటి కనీసం దానిని ప్రారంభించడం కాదు కదా కనీసం దాన్ని ఎలా ఆపరేట్ చేయడం కూడా చేయలదేని విమర్శించారు. ఎల్‌పీజీ గ్యాస్ బర్నర్ క్రిమిటోరియం, సింగిల్ బర్నర్‌ను బూడిదను సేకరించేందుకు ఒక ఫిట్‌ను ఏర్పాటు చేసి, ఆటోమెటిక్ ఎల్‌పీజీ బర్నర్ విత్ సీక్వెన్సీ కంట్రోలర్ ఏర్పాటు చేసిన ఉపయోగం లేకుండా పోయిందని ఆరోపించారు.ఎల్‌పీజీ గ్యాస్ పైపులైన్ ఏర్పాటు చేయడంతోపాటు కంట్రోల్ ప్యానల్ బోర్డు, వెట్ స్క్రబ్బర్, విత్ పంపుమోటారు, హెచ్‌పీ బ్లోయర్ బెల్టు, క్రిమిటోరియాన్ని విశాలమైన వైశాల్యంలో నిర్మించిన, అమలుకు నోచుకోక పోవడం దురదృష్టకరం అని, వాపోయారు. గ్యాస్ క్రిమిటోరియం బర్నర్‌ను ఏర్పాటు చేయడం వల్ల అంత్యక్రియల ప్రక్రియ సరళీకృతం కావడంతోపాటు సాంప్రదాయబద్ధంగా చేసే అంత్యక్రియల కంటే ఇందులో దహనం చేయడానికి అయ్యే వ్యయం తక్కువవుతుందని, పర్యావరణ పరంగానూ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని. గ్యాస్ దహన ప్రక్రియలో ఒక శరీరాన్ని దహనం చేసేందుకు సగటున 45 నిమిషాల సమయం పడుతుందినీ పేర్కొన్నారు. ఇప్పటికైనా రామగుండం నగరపాలక సంస్థ సంబంధించిన అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని దహన సంస్కారాలు యంత్రం గురించి ఆలోచన చేసి పర్యావరణకు అనుకూలంగా ఉండే విధంగా దానికి అమలు చేయాలని మద్దెల దినేష్ డిమాండ్ చేశారు.
Admin
Aakanksha News