ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఏడాది కాంగ్రెస్ పాలన బాగుందని, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి తగ్గిందని ఓబీసీ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ పేర్కొన్నారు. గత ఐదేళ్లలో పట్టుకున్న 306కేసుల్లో దాదాపు 50 శాతం కేసులు 152 కేసులను నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ పట్టుకుందని. ప్రభుత్వాధినేతలు అవినీతిలో కోరుకుపోయి అధికారులను ప్రజలను దోచుకోమని గత ప్రభుత్వంలో జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై ఉక్కు పాదం మోపి అవినీతి అధికారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నయని అన్నారు. ఏసీబీ అధికారులకు పూర్తి స్వేచ్ఛను గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల అధికారులు ఇస్తా రాజ్యాంగ అవినీతిని పండించారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏసీబీకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంలో ఎక్కువ కేసులు పట్టుకుందని తెలిపారు.1000 కోట్లకు అడగలేత్తిన హెచ్ఎండిఏ అధికారి బాలకృష్ణ దోపిడికి టిఆర్ఎస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు.కాంగ్రెస్ పాలన మొదటి సంవత్సరంలోనే 55,000 పైగా ఉద్యోగ నియామకాలు చేప ట్టిందని ఓబీసీ హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ ఆదివారం ఒక ప్రకట నలో పేర్కొన్నారు. లక్షలాదిమంది నిరుద్యోగుల ఆకాంక్షలు ఈ ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగిత శాతం తగ్గుముఖం పట్టిందని జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో వెల్ల డైందని పేర్కొన్నారు. గతప్రభుత్వంలో ఉద్యోగులకు నెల జీతం ఎప్పుడు పడుతుందో తెలిసేది కాదని, ఈ ప్రజా ప్రభుత్వంలో ఒకటో తేదీని జీతాలు పడుతున్నాయని తెలిపారు. దేశంలోనే చారిత్రా త్మకంగా బీసీ కులగణన, ఇంటింటి సర్వే చేపడుతోందని పేర్కొన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ. 6,700 కోట్లు చెల్లిస్తూ, విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచిందని, రైతులకు రుణమాఫీ చేసిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిం దన్నారు. 200 యూనిట్ల వరకు గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తుందని పేర్కొన్నారు. హోంగార్డులకు జీతాలు పెంచిందని, ఈ ప్రజా ప్రభుత్వ ఏడాది పాలనలోనే ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు న్నారని తెలిపారు
Admin
Aakanksha News