ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి జిల్లా : ప్రేమించనన్నాడు..పెళ్లి చేసుకొని కలసి జీవిద్దామని ఎన్నో మాటలు చెప్పి చివరకు పెళ్లి అనే సరికి ఓ యువకుడు మొహం ఛాటేయడంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...పెద్దపల్లి మండలం హనుమంతుని పేట గ్రామానికి చెందిన,రాజ్ కుమార్,ప్రియాంక లు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేయడంతో రాజ్ కుమార్ ససేమిరా అనడంతో ప్రియాంక రాజ్ కుమార్ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించింది.పెళ్లి చేసుకునే అంతవరకు దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పింది. దీంతో స్థానిక సర్పంచ్ చొరవ చేసుకొని అబ్బాయి అమ్మాయితో మాట్లాడి, పెళ్లి చేస్తానని మాట ఇవ్వడంతో, దీక్ష విరమించి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.
Admin
Aakanksha News