ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సింగరేణిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు 5 సం"రాల నుంచి సియంపిఎఫ్ చిట్టిలను ఇవ్వాలని గోదావరిఖని సియంపిఎఫ్ ఆఫీస్ వద్ద సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ.. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులపై ఒకవైపు యాజమాన్యం, మరో వైపు ప్రభుత్వాలు ప్రతి విషయంలో సవతితల్లి ప్రేమనే చూపిస్తున్నాయన్నారు.చివరికి కార్మికుల వేతనాల నుంచి కట్ చేసే సియంపిఎఫ్ డబ్బుల వివరాలను ఇవ్వడంలో కూడా తీవ్ర జాప్యం చేస్తున్నారని తెలిపారు. అలాగే కార్మికులకు రావలసిన 5 సం"రాల సియంపిఎఫ్ చిట్టిలను ఇవ్వాలని SCKS-CITU ఆధ్వర్యంలో పోరాటాలు చేసిన అటు సింగరేణి యాజమాన్యం, ఇటు సియంపిఎఫ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. సియంపిఎఫ్ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తాం అని హెచ్చరించారు. అనంతరం సంబంధిత అధికారులకు మెమోరాండంను అందించారు. ఈ కార్యక్రమంలో దూలం శ్రీనివాస్ SCKS-CITU బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి, గట్టు మహేందర్ శ్రీరాంపూర్ డివిజన్ కార్యదర్శి, చిప్పకుర్తి అరవింద్ RG3 డివిజన్ కార్యదర్శి, గందం రవి RKP పట్టణ కార్యదర్శి, D. తిరుపతి, రాయమల్లు, సంపత్, బండ రాజేందర్ సతీష్ రాజేందర్ సుధాకర్, నాగరాజు, శ్రీను, ఓదమ్మ, రవి తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News