Monday, 10 August 2026 04:51:57 PM

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి....

డిప్యూటీ సీఎంను కలిసిన గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు

Date : 20 January 2024 06:07 PM Views : 494

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం,ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసారు. సింగరేణిలో నూతన భూగర్భ గనులను తీసుకురావాలని సింగరేణి యాజమాన్యం బిడ్ లలో పాల్గొనే విధంగా యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు.అలాగే సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలుతో పాటు కోల్ ఇండియాలో కార్మికులకు యాజమాన్యం చెల్లిస్తున్నటువంటి సింగరేణిలో పెర్క్స్ పై ఐటి మినహాయింపును అధికారులకు చెల్లిస్తున్న యాజమాన్యం కార్మికులకు కూడా చెల్లించే విధంగా చూడాలని కోరారు. ఇటీవల హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 149 మంది జూనియర్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని తదితర సింగరేణి కార్మికుల సమస్యల పైన వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తింపు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రంగయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు సారయ్య, కె వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :