ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వాకం బయట పడింది.. ఓ విద్యార్థిని పాలిట పాఠశాల ఇచ్చిన టీసీ శాపంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... చంద్రశేఖర్ నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇటీవల విద్యార్థిని పదవ తరగతి పూర్తి చేసింది. అయితే ఇటీవలే సదరు విద్యార్థినిని పాఠశాల నుంచి టీసీ తీసుకోగా సదురు పాఠశాల యాజమాన్యం ఇచ్చిన టీసీలో అన్ని తప్పులు ఉండటంతో సదరు విద్యార్థినిని పాలిటెక్నిక్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు వెళ్లిన సమయంలో టీసీ చూసిన అక్కడి అధికారులు అన్ని తప్పులు ఉన్నాయని నిరాకరించారు. దీంతో యాజమాన్యం ఇచ్చిన టీసీని తీసుకుని మళ్ళీ పాఠశాలకు వెళ్లి అడగగా విద్యార్థినిని తల్లిదండ్రులపైనే పాఠశాలకు చెందిన ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కనీస పరిజ్ఞానం లేకుండా విద్యార్థులకు ఇచ్చే టీసీ విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలపై చర్యలు తీసుకుంటాం... రామగుండం ఎంఈఓ సంపత్ రావు... తప్పులతడకగా ఇచ్చిన టీసీపై రామగుండం ఎంఈఓ ను ఫోన్ లైన్ లో సంప్రదించగా విద్యార్థులకు ఇచ్చే టీసీలలో నిర్లక్ష్యం వహించి తప్పుల తడకగా ఇచ్చిన పాఠశాలపై వివరణ కోరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Admin
Aakanksha News