Wednesday, 23 September 2026 11:25:06 AM

వామపక్షా ప్రజాతంత్ర పార్టీలపై కేంద్ర ప్రభుత్వ దాడులు వెంటనే ఆపాలి....

సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై. యాకయ్య

Date : 23 March 2024 01:48 PM Views : 719

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వరంగల్ జిల్లా : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న వామపక్ష ప్రజాతంత్ర పార్టీలపై సిబిఐ, సిఐడి దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని పార్టీ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై.యాకయ్య హాజరై మాట్లాడారు.. కేంద్ర ప్రభుత్వంను ప్రశ్నించే ఇండియా కూటమిలో ఉన్న వామపక్ష ప్రజాతంత్ర పార్టీలపైన ఆర్థిక నేరాలను మోపుతూ వారిపై సీబీఐ సిఐడి దర్యాప్తు సంస్థలతో దాడి చేయిస్తూ వారి బ్యాంకులను సీజ్ చేయిస్తున్నారని అన్నారు. మరోవైపు రాముని పేరుతో పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్ల గెలుపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. దీంతో పాటు దేశంలో ప్రతిపక్షం ఉండకుండా ఎన్నికల్లో జెమిలీ విధానాన్ని తీసుకురావాలని తీవ్ర ప్రయత్నం చేస్తు అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే వామపక్ష ప్రజాతంత్ర పార్టీలపైన కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో దాడులు చేపిస్తూ పార్లమెంటులో వారు స్వేచ్ఛగా అడుగు పెట్టొద్దని ఉద్దేశంతో అనేక రకాలుగా దేశంలో వివిధ రకాల పేరుతో దాడులు చేస్తుందని వారు గుర్తు చేశారు. కాబట్టి దీనికి నిరసనగా దేశ వ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా దర్యాప్తు సంస్థలని స్వేచ్ఛగా పారదర్శకంగా పనిచేసే విధంగా చూడాలాన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా నాయకులు మహేశ్వరి, కుమారస్వామి, నాయకులు రమణ, సాగర్, క్రాంతి, భాగ్య, శంకర్, అనూష, హమీద, అంజలి, దీప తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :