Saturday, 18 January 2025 10:11:56 AM

ఓసీపీ-5 ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ లతో ఆరోగ్య సమస్యలకు గురవుతున్న ప్రజలు

5వ రోజుకు చేరుకున్న హాత్ సే హత్ జోడో పాదయాత్ర

Date : 10 February 2023 02:11 PM Views : 184

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / గోదావరిఖని : రామగుండం కార్పోరేషన్ పరిధిలో హాత్ సే హత్ జోడో పాదయాత్ర శుక్రవారం 5 రోజుకు చేరుకుంది. 29, 8 వ డివిజన్ లలో పాదయాత్రను నిర్వహించారు.ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ.. ఓసీపీ-5 బ్లాస్టింగ్ ల వల్ల దుమ్ము, ధూళి కాలుష్యంతో ప్రజలు గుండె, కిడ్నీ వంటి అనేక ఆరోగ్య సమస్యల తో బాధపడుతున్నారని అన్నారు. ప్రశ్నించే వారిని బిఆర్ఎస్ పార్టీ వాళ్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. దోపిడి తప్ప అభివృద్ధి ఏమి లేదని ఆరోపించారు. రామగుండం అభివృద్ధి కోసం అనునిత్యం ప్రజాక్షేత్రంలో నిరంతరం శ్రమిస్తూనే ప్రజాసేవకే నా జీవితం అంకితం అని పేర్కొన్నారు. గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని ఎప్పుడు నేను ఎంతో మందికి సహాయం చేసిందే తప్పితే తిరిగి నేను ఎప్పుడు ఎవరిని సహాయం కోరలేదని అన్నారు. ఈసారి నాకు ఒక్క అవకాశం ఇస్తే ఎన్నో ఏళ్ల నుంచి నిర్లక్ష్యానికి గురైన పారిశ్రామిక ప్రాంతానికి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని నేను మాటల్లో కాదు చేతల్లో నా పనే సమాధానం చెప్తుంది అని పేర్కొన్నారు. మాయ మాటలు చెప్పడం నటించడం నాకు చేతకాదని ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా అని అవసరమైతే పారిశ్రామిక ప్రాంత ప్రయోజనాల కోసం నా ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి పని చేసి చూపిస్తానని తెలిపారు.ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ గారు ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి గారు మరియు కార్పొరేటర్లు గాధం విజయనంద్ గారు md ముస్తఫా మాటూరు సత్య ప్రసాద్ చొప్పదండి దుర్గాప్రసాద్ తాళ్లపల్లి యుగంధర్ మేకల పోశం గట్ల రమేష్ గారు ఉమ్మేతుల దేవేందర్ రెడ్డి మల్ రెడ్డి గారు ఆషిప్ పాషా సీనియర్ నాయకులతో పాటు యువ నాయకులు నాజిమ్, కౌటాం సతీష్, కళ్యాణ్,సోషల్ మీడియా కోర్డినేటర్ సతీష్ దూళికట్ట గాదె సుధాకర్ గారు బర్పటి శ్రీనివాస్ సింగం కిరణ్, రాయ మల్లు యాదవ్, గజ్జల నాగరాజ్ తో పాటు మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు