ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ గురించి మాట్లాడిన మాటలపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం కురిపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.. పదేళ్లుగా సీఎంగా పని చేసిన కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి జుగుప్సాకరంగా మాట్లాడి తెలంగాణ పరువు తీశారని ధ్వజమెత్తారు.బిజెపి జపం చేస్తూ.. పొగుడుతూ, కేసీఆర్ ను మాత్రం అగౌరవపరిచారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో సీఎంకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. ప్రతిపక్ష నేతకు అంతే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. కెసిఆర్ మీద అక్కసుతో ఆయనకు సరైన ఛాంబర్ కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడు సూచించిన వారినే పిఎసి ఛైర్మన్‌గా నియమించడం ఆనవాయితీ అని కానీ ప్రతిపక్ష నేతను సంప్రదించకుండానే పిఎసి ఛైర్మన్‌ను నియమించి ఆనవాయితీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News