Saturday, 26 September 2026 12:52:58 AM

జీహెచ్‌ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఇలంబరితి బాధ్యతలు..

Date : 17 October 2024 07:28 PM Views : 494

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఇలంబరితి బాధ్యతలు స్వీకరించారు. తాజాగా రిలీవ్ అయిన ఐఏఎస్‌ల స్థానాల్లో నూతన ఇన్‌ఛార్జ్‌లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. నూతన జీహెచ్ఏంసీ కమిషనర్‌గా ఇలంబరితి, టూరిజం శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్. శ్రీధర్‌, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా, మహిళ సంక్షేమ శాఖ కార్యదర్శిగా టి.కె.శ్రీదేవికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా ఉన్న ఆమ్ర‌పాలి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రిలీవ్ అయ్యారు. దీంతో ట్రాన్స్‌పోర్టు క‌మిష‌న‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇలంబ‌రితికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు అప్ప‌గించింది సర్కార్.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :