Tuesday, 11 August 2026 07:56:26 PM

శ్రీ విద్యా సెకండరీ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మైథిలి రెడ్డి కి కమాండేషన్ అవార్డు...

Date : 30 January 2025 07:20 AM Views : 514

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : శ్రీవిద్య సెకండరీ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మెట్టకంటి మైథిలి రెడ్డికి హైదరాబాద్ కలెక్టర్ చేతుల మీదుగా కలెక్టరేట్లో కమాండేషన్ అవార్డును ప్రధానం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ నిర్వహించిన టీవీ కార్యక్రమం నిర్మూలన కు గతంలో టీబీ పేషెంట్లకు ఆరు నెలల పాటు ఉచితంగా న్యూట్రిషనల్ ఫుడ్ బాస్కెట్ కిట్లను పంపిణీ చేశారు. అంతేకాకుండా నిరుపేద కుటుంబాల పిల్లల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖకు చేసిన సేవలకు గుర్తుగా ఈ రోజున ఈ అవార్డు లభించింది. మైథిలి రెడ్డి మాట్లాడుతూ ఈ అవార్డు ను అందుకోవడం చాలా సంతోషంగా ఉందని దీనికి ముఖ్య కారుకులైన రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ అవార్డు ద్వారా బాధ్యత మరింత పెరిగి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :