Thursday, 25 June 2026 07:53:56 PM

విద్యార్థిడిని చితకబాదిన ఉపాధ్యాయుడు..

Date : 17 October 2024 12:25 PM Views : 727

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాలో తరగతి గదిలో ఓ విద్యార్థిని అమానుషంగా ఉపాధ్యాయుడు తోటి విద్యార్థుల ముందే చితకబాదాడు. అయితే విచక్షణ కోల్పోయిన ఉపాధ్యాయుడు ఇష్టానుసారంగా కొట్టడంతో బాలుడు గాయలతో కన్నీరు పెట్టుకుంటూ ఇంటికి వెళ్లగా ఏమైందని తల్లి తండ్రులు ఆరా తీశారు. దీంతో బాలుడు జరిగిన విషయాన్నీ వారికి చెప్పడంతో పాఠశాల ముందు ఆందోళన చేసారు. వెంటనే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే బాలుడిని కొట్టిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కావడంతో అది చుసిన విద్యార్థి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :