ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మాజీ ముఖ్య మంత్రి కెసిఆర్ గురువారం అర్థరాత్రికాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శించేందుకు ఎవరూ హాస్పిటల్ రావొద్దని అభిమానులకుఎమ్మెల్యే హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. కాగా, కేసీఆర్‌ను పరిశీలించిన వైద్యులు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయనున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని హరీశ్ రావు తెలిపారు.ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (స్పందించారు. బీఆర్‌ఎస్ అధినేత సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.కాగా కేసీఆర్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తన సతీమణి, తనయుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ వెంకట్ రెడ్డితో కలిసి పరామర్శించారు. శుక్రవారం యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
Admin
Aakanksha News