Tuesday, 11 August 2026 07:33:04 PM

తెలంగాణ రాష్ట్రం పేదల కన్నీళ్ల రాష్ట్రంగా మారుతోంది...

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు

Date : 30 September 2024 04:13 PM Views : 469

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల కన్నీళ్ల రాష్ట్రంగా మారుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...గత వారం పది రోజులుగా హైదరాబాద్‌ మహానగరంలో హైడ్రా కూల్చివేతల పేరుతో పేద ప్రజలను రోడ్డున పడేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో సూర్యాపేట, ఆదిలాబాద్‌, సంగారెడ్డి ఇతర కొన్ని పట్టణాల్లో చాలాచోట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్ల చాలామంది పేదలు మా పార్టీ నాయకత్వాన్ని కలిసి పెద్దలు కేసీఆర్‌ను తలచుకుంటూ జరిగిన అన్యాయలపై తమ బాధను చెప్పుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలు.. చేసిన వాగ్ధానాలు ఏమిటీ.. అసలు అధికారంలోకి వచ్చాక చేస్తోంది ఏంటీ అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైన అన్యాయం మళ్లొకసారి కాంగ్రెస్‌ పార్టీ చేస్తోందని మేం ఊహించలేదన్నారు. ఏ ఇందిరమ్మ చెప్పింది? యే సోనియమ్మ చెప్పింది పేదల కొంపలు కూల్చి పెద్దలకు లాభం చేయమని అని ప్రశ్నించారు.రేవంత్‌రెడ్డికి ఇవాళ తెలంగాణలోని పేద తల్లులందరూ మా నాయకత్వం వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారని అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :