Friday, 07 August 2026 04:23:38 AM

వైఎస్ఆర్ టీపీ షర్మిల పాదయాత్ర బస్సు దగ్ధం

రాళ్లు రువ్విన ఆందోళనకారులు కార్ల అద్దాలు ధ్వంసం.

Date : 28 November 2022 03:30 PM Views : 617

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సంగారెడ్డి జిల్లా : తెలంగాణ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నర్సంపేట్ నియోజకవర్గంలో చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.షర్మిల పాదయాత్ర చేస్తుండగా.. చెన్నారావుపేట మండలం లింగగిరిలో మధ్యాహ్నాం లంచ్ సమయంలో కాన్వాయ్ లోని బస్ ను టీఆర్ఎస్ పార్టీ అనుచరులు తగలబెట్టారు. పాదయాత్ర వాహనాలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. పలు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. అయితే MLA పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు షర్మిల కాన్వాయ్ లోని ఒక బస్సుకు నిప్పు పెట్టారు. షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల సమక్షంలోనే దాడులు చేశారంట వైయస్ఆర్ టీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా దాడులు చేసిన పాదయాత్రను ఆపేది లేదంటూ స్పష్టం చేశారు. ఈ దాడులతో షర్మిలను భయపెట్టలేరని అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :