Saturday, 26 September 2026 11:35:19 PM

ఎస్సీ,ఎస్టీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ప్రథమ కరపత్రం ఆవిష్కరణ..

Date : 03 November 2024 07:59 PM Views : 546

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ప్రథమ మహాసభ కరపత్రాన్ని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను తన నివాసంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్‌కు అసోసియేషన్‌ రాష్ట్ర నాయకులు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నవంబర్‌ 10న హైదరాబాదులో జరుగనున్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ప్రథమ మహాసభకు సంబంధించిన కరపత్రాన్ని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ చేతుల మీదుగా అవిష్కరింపజేశారు. మహా సభలకు ముఖ్య అతిథిగా రావాలని స్పీకర్‌ను ఈ సందర్భంగా అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ అసెంబ్లి ఇన్చార్జి పామెన భీమ్ భారత్, ఎస్సీ ,ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కట్కూరి మల్లేష్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి అరెల్లి మల్లేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాల సాయిరాజ్, గుండ్ల కుమారస్వామి, సీనియర్ జర్నలిస్ట్ డేగరీ వెంకటేష్ , ఎల్ల సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :