ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్నవారికి ఖచ్చితంగా శిక్ష పడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చేసిన దోపిడీ సరిపోదన్నట్టుగా.. ఢిల్లీకి పోయి దందాలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ పేరుతో వేల ఎకరాల భూమిని మాయం చేశారని, వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించుకుని ఆ అవినీతి సొమ్ముతో తమలాంటి వాళ్లను ఓడించేందుకు ఖర్చు పెడుతున్న సంగతి నిజం కాదా? అని ప్రశ్నించారు. 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్లు ఖర్చు పెట్టి ఓట్లను కొనుక్కునే స్థాయికి కేసీఆర్ ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు వందల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తున్నది ఎవరో చెప్పాలని అడిగారు. టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో రూ. 800 కోట్ల వైట్ మనీ ఉందని కేసీఆర్ చెప్పారని... అతి తక్కువ కాలంలోనే ఇంత భారీగా సొమ్ము ఎలా వచ్చిందని ఈటల ప్రశ్నించారు. ఉపవాసం ఉన్న పార్టీకి ఇంత తక్కువ కాలంలోనే వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగారు. ఎవరూ ఊరికే డబ్బులు ఇవ్వరని ఈ విషయంపై తెలంగాణ ప్రజలు ఆలోచించాలని సూచించారు.
Admin
Aakanksha News