Tuesday, 11 August 2026 09:07:07 PM

జిల్లా కలెక్టర్,అధికారులపై రాళ్ళతో రైతుల దాడి...

సీఎం సొంత జిల్లాలో అధికారులపై తిరగబడిన రైతులు... కలెక్టర్ వాహనం ధ్వంసం...

Date : 11 November 2024 06:03 PM Views : 695

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / వికారాబాద్ జిల్లా : ప్రజా నిర్ణయాలకు వ్యతిరేకంగా, వెళ్లిన అధికారులు, ఏకంగా జిల్లా కలెక్టర్ పై, రైతులు ప్రజలు తిరగబడి కొట్టిన సంఘటన వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...సీఎం సొంత జిల్లాలోని దుద్యాల, లగచర్ల పోలేపల్లి, లగచర్ల తాండలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గ్రామస్థుల అభిప్రాయ సేకరణ కు అధికారులతో కలిసి వచ్చారు. అయితే ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు గ్రామస్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కలెక్టర్ తో పాటు అధికారులపై దాడికి పాల్పడ్డారు. అంతే కాకుండా ఓ మహిళ కలెక్టర్ పై చేయి చేసుకోగ కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో కలెక్టర్ వాహనంతో పాటు మూడు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :