Friday, 25 September 2026 11:17:00 PM

కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి

Date : 13 February 2023 11:41 AM Views : 1312

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నగర పాలక సంస్థలోని పారిశుధ్య విభాగంలో డబ్బులకు ఆశపడి ఒకరి బదలు ఇంకొకరిని నియమించుకొని పనులు చెపిస్తు కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని సిపిఐ నాయకులు కె. కనకరాజు, మద్దెల దినేష్, లు అన్నారు. మారు పేర్లతో ఇతరులను నియమించి రికార్డులలో ఒక పేరు పని చేసే వ్యక్తి మరో పేరు ఉంటుందని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు కరెంట్ షాక్ కు గురైన ఒక కార్మికుడు చనిపోవడం బాధాకరం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? సానిటరీ అధికారుల, ఆ డివిజన్ సూపర్ వైజరా, లేక నగర పాలక సంస్థ కమిషనరా? అని ప్రశ్నించారు. ఇలా మారు పేర్లతో దాదాపు 20 మందికి పైగా పని చేస్తున్నారని విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే వారి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని సిపిఐ నాయకులు కె. కనకరాజు, మద్దెల దినేష్, లు డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :