Tuesday, 11 August 2026 11:59:02 PM

జీఓ నెం.81 ప్రకారం 61సం. వయస్సు పైబడిన విఆర్ఎ ల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి...

బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు,రాజ్యసభ సబ్యులు ఆర్. కృష్ణయ్య

Date : 14 February 2025 08:53 PM Views : 497

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : జీఓ నెం.81 ప్రకారం 61సం. వయస్సు పైబడిన విఆర్ఎ ల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు,రాజ్యసభ సబ్యులు ఆర్. కృష్ణయ్యతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో మెడియా సమావేశం లో నిరుద్యోగుల జైవిసి చైర్మన్ నీల వెంకటేష్, విఆర్ఎ జేఏసీ అధ్యక్షులు ఆంజనేయులు తో కలిసి మాట్లాడారు. 2020 సెప్టెంబర్ 9న గత ప్రభుత్వం అసెంబ్లీలో విఆర్ఎలకు పేస్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందని,ఆ హామీలను అమలు చేయాలని విఆర్ఎలు రాష్ట్రవ్యాప్తంగా 80 రోజుల పాటు దీర్ఘకాలిక సమ్మె పోరాటం ఫలితంగా గత ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారుల సమక్షంలో విఆరి జెఏసితో చర్చలు జరిపి జీఓ నెం.81, 85లను విడుదల చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20,555 మంది విఆర్వోల్లో డిగ్రీ చదివిన వారిని జూనియర్ అసిస్టెంట్స్. ఇంటర్ చదివిన వారిని రికార్డు అసిస్టెంట్స్, పదవ తరగతి లోపు చదివిన వారిని ఆఫీస్ సబార్డినేటర్స్, రెవన్యూ శాఖతో పాటు, మున్సిపల్, ఇరిగేషన్, మిషన్ భగీరధ, విద్యా, వైద్య తదితర శాఖల్లో ఉన్న ఖాళీల్లో 16,758 మంది విఆర్ఎలను ప్రభుత్వం సర్దుబాటు చేసిందన్నారు. మిగతా 3,797 మంది విఆర్ఎ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా గత 15 నెలలుగా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆర్. కృష్ణయ్య విమర్శించారు. గత 15 నెలలుగా గతంలో 20,555 మంది చేసి రెవిన్యూ పనులను ప్రస్తుతం 3,797 మంది విఆర్ఎలు చేస్తున్నారు. వయస్సు పైబడి అనారోగ్యంపాలైనా, తండ్రుల స్థానంలో వారి వారసులు కొందరు విఆర్వోలుగా విదులు నిర్వహిస్తున్నాము. 61 సం||ల విఆర్ఎ వారసులకు ఉద్యోగం ఇవ్వడం ఫలితంగా చదువుకున్న యువత, అనుభవం అర్హతలున్నవారు రెవెన్యూ వ్యవస్థలోకి వస్తారు. ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థ బలోపేతం అవుతుంది. వారసత్వ విఆరిల సేవలు రెవెన్యూ వ్యవస్థకు తోడవుతాయి. పైగా వీరికి ఇవ్వడం వలన 3793 మండి నిరుద్యోగులకు ఉద్యగాలు ఇచ్చినట్లు అవుతుందన్నారు. ఈ సమావేశంలో ఆంజనేయులు, అనిల్, శ్రీనివాసులు, రాజు, చందు, స్వరూప, లక్ష్మణ్, గంగమల్లు, హరీష్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :