Tuesday, 11 August 2026 05:57:07 PM

పరిపాల నా నైపుణ్యం ప్రభావంతమైన రాజకీయం.... 2025’ సంవత్సరానికి100 మంది ప్రముఖులతో జాబితా వి డుదల చేసిన ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్

అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Date : 29 March 2025 07:33 PM Views : 578

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : తన పరిపాల నా నైపుణ్యం ప్రభావంతమైన రాజకీయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా నిలిచారు. ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2025’ సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తిమంతులైన 100 మంది ప్రముఖులతో జాబితా వి డుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 28వ స్థానం దక్కించుకున్నారు. 2024 సంవత్సరపు జాబితాలో 39 స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 28వ స్థా నానికి చేరుకోవడం విశేషం. దేశంలో రాజకీ య, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యం త ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర పాలనలో తీసుకువచ్చిన మా ర్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్యకలాపా లు,దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో పోషిస్తున్న ప్రముఖమైన పాత్రతో రేవంత్‌కు ఈ గు ర్తింపు లభించింది. తనదైనదూకుడుతో భారత రాజకీయాల్లో ఆయన చూపుతున్న ప్రభావం, నాయకత్వ లక్షణాలతో ఆయన ర్యాంకు మెరుగుపడింది. ఒక ప్రాంతీయ నాయకుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భవించారు. ఈ జాబితాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇండియా కూటమిలోని ఇతర ప్రముఖులైన సిఎంల సరసన నిలిపింది. ప్రాంతీయ అవసరాలను జాతీయ ప్రాధాన్యతలతో సమన్వయం చేయగలిగిన మేధో సంపత్తి, వ్యూహాత్మక దృక్పథం రేవంత్ రెడ్డిని కీలక నాయకునిగా నిలిపేలా చేశాయి. శక్తిమంతులై వంద మంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మొదటి 10 స్థానాల్లో ఉన్నారు.

విధానపరమైన నిర్ణయాలతో…

రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల రుణ మాఫీ చేయడం, క్వింటాల్ ధాన్యానికి రూ.500లు బోనస్ ఇవ్వడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్‌లు, పెట్రోల్ బంక్‌లు, ప్రీమియం రిటైల్ స్టోర్ల వంటి వ్యాపార అవకాశాలను కల్పించడం, యువతను నిపుణులుగా తీర్చిదిద్దే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ట్రాన్స్‌జెండర్ల నియామకం వంటి అనేక విధానపరమైన వినూత్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాదరణ పెరగడానికి కారణమయ్యాయి. నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన దృఢమైన అభిప్రాయాలు కూడా ఆయనకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం దక్కేలా చేశాయి.

ఇది సిఎం బాధ్యతను మరింత పెంచింది: పిసిసి అధ్యక్షుడు

పారదర్శకమైన పాలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడినందునే ‘ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ అత్యంత శక్తిమంతుల జాబితా-2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుర్తింపు లభించిందని పిసిసి అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అన్నారు. ఈ గుర్తింపుతో దేశ, తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి బాధ్య తను మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు. భారతీయ శక్తిమంతులైన జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చోటు లభించడం భారత రాజ కీయాల్లో కీలక మార్పునకు సంకేతమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ నేతలు ఇప్పుడు జాతీయ విధానాల రూపకల్పనలో మరింత ప్రభావం చూపుతున్నారనడానికి ఇదే నిదర్శమని వారు పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :