Monday, 10 August 2026 03:50:07 PM

గోమాస నీ స్థాయికి మించి మాట్లాడటం తగ్గించుకోవాలి...

అవకాశవాదికి పెద్దపల్లి బీజేపీ టికెట్ ను కేటాయించడం బాధాకరం... కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మడి కుమారస్వామి

Date : 23 March 2024 11:49 AM Views : 1379

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ వివేక్ వెంకటస్వామి (కాక) కుటుంబంపై తన స్థాయికి మించి మాట్లాడటం తగ్గించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి అన్నారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీజేపీ లో ఎంతో మంది సీనియర్ నాయకులను కాదని ఒక్క అవకాశవాది గోమాస శ్రీనివాస్ కు బీజేపీ పార్లమెంట్ టికెట్ కేటాయించడం పట్ల సిగ్గు పడాల్సి వచ్చిందని విమర్శించారు. బీజేపీ పార్టీ నుండి గెలిస్తే ఏం చేస్తావో ప్రజలకు వివరించాలి కానీ ఇలా వెంకటస్వామి కుటుంబంపై అవాకులు, చివాకులు చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. నీకు దమ్ము, దైర్యం ఉంటే బీజేపీ నుండి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఎలక్షన్ సమయంలో వచ్చి టికెట్ కావాలని చెప్పి నువ్వెక్కని పార్టీ మెట్లు ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. మొదటినుండి వెంకటస్వామి కుటుంబం ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి ప్రజల అవసరాలను తీర్చే నాయకత్వం కావాలని అన్నారు. అలాగే గోమాస శ్రీనివాస్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దొరల పాలనను అంతం చేస్తానని, దొరల గడిలు బద్దలు కొడతానని చెప్పి దొరల గడీల చేరిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఎందుకు ప్రశ్నించారని పేర్కొన్నారు. గోమాస శ్రీనివాస్ నోరు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో గడ్డం సతీష్, పంజా శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్యాంసుందర చారి తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :