Wednesday, 23 September 2026 11:25:20 AM

నందిని లఘు చిత్రం ఆవిష్కరణ

Date : 19 January 2023 02:48 PM Views : 444

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన లఘు చిత్రాల దర్శకుడు గొట్టే మహేష్ దర్శకత్వంలో స్థానిక కళాకారులతో రూపొందించిన "నందిని" లఘు చిత్రాన్ని ఆవిష్కరించారు. మార్కండేయ కాలనిలోని రేయన్ బో పాఠశాలలో మ్యాజిక్ రాజా అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిదులుగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, అర్జీ1 ఏరియా జిడికే 2వ బొగ్గుగని డిప్యూటీ మేనేజర్ మాధవరెడ్డి , సీనియర్ జర్నలిస్ట్ దయనంద్ గాంధీ, రేయన్ బో స్కూల్ అధినేత అమరెందర్ రావు, సీనియర్ దర్శకుడు దామెరా శంకర్, చంద్రపల్,వడ్డపల్లి శంకర్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించారు. మంచి సందేశాత్మక ప్రేమ కథ చిత్రాన్ని చిత్రీకరించిన డైరెక్టర్ మహేష్ తో పాటు చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను అతిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నటులు సంజీత్ రాజ్,కుంచాల మనీషా, తిరుపతి, సీతామహాలక్ష్మీ, మూల శంకర్, రహీం,రాజేష్ లతో పాటు డి ఓ పి అరె సందీప్, మేకప్ అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :