Thursday, 25 June 2026 06:35:53 PM

క్రేన్ వాహనంతో లాక్కెళ్ళిన పోలీసులు...

కారులో ఉండగానే ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు..

Date : 29 November 2022 02:31 PM Views : 666

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : నర్సంపేట నియోజకవర్గంలో వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కొందరు కొందరు టిఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేసి బస్సుతోపాటు కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. అయితే లోటస్ పాండ్ లోని షర్మిల నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో షర్మిల బయటకు రాకుండా ఇంటి బయట భారీగా పోలీసులు మోహరించి హౌస్ అరెస్ట్ చేసేందుకు సిద్ధమ్యయారు. దీంతో పోలీసుల కళ్లుగప్పిన షర్మిల వారికి తెలియకుండా సోమాజిగూడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రగతి భవన్ ముట్టడించేందుకు సోమాజిగూడ వెళ్లిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. నిన్న దాడిలో ధ్వంసమైన కారులోనే సోమాజిగూడకు వెళ్లారు. టీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేసిన బస్సును కూడా ప్రగతి భవన్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు షర్మిల కారుకు అడ్డంగా తమ వాహనాలను నిలిపారు. షర్మిలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో కారు అద్దాలు మూసివేసి కారులోనే బైఠాయించారు. ముందుకు వెళ్లేందుకు అనుమతించక పోవడంతో పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు వైయస్ షర్మిలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా కూడా ఎంత నచ్చచెప్పిన షర్మిల వినకపోవడంతో చివరకు పోలీసులు శాంతిభద్రతలు, ట్రాఫిక్ జాం పేరుతో షర్మిల కారులో ఉండగానే క్రేన్ సహాయంతో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ కూడా కారులోనే ఉండి షర్మిల నిరసన కార్యక్రమం చేపడుతుంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :