Wednesday, 23 September 2026 05:27:49 AM

గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో ప్రొజెక్టర్ చోరీ..?

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన....

Date : 24 November 2022 03:09 PM Views : 1559

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : నిత్యం రద్దీగా ఉండే గోదావరిఖని శారద నగర్ లోని సర్వజనిక ప్రభుత్వ ప్రాంతియ ఆస్పత్రిలో ప్రొజెక్టర్ చోరీకి గురైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.. వివరాల్లోకి వెళితే... ప్రాంతీయ ఆసుపత్రిలో ఈ నెల 12వ తేదీన ప్రొజెక్టర్ చోరీకి గురైనట్లు తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం 2 గంటల సమయం వరకు ఉన్న ప్రొజెక్టర్ సాయంత్రం వరకు సిబ్బందికి కనిపించకపోవడంపై ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే దీనిపై ఆసుపత్రి ఆర్ఎంఓ ను ఫోన్ లైన్ లో వివరణ కోరగా ప్రొజెక్టర్ చోరీకి గురైంది వాస్తవమేనని ఈ నెల 12వ తేదీన చోరీకి గురైందని తెలిపారు. దీంతోపాటు చోరీకి గురైన సమయంలో ఐదుగురు సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఉన్నారని వివరాలు వెల్లడించారు. అంతే కాకుండా అక్కడ వర్క్ నడుస్తున్న సమయంలో సంబంధిత కాంట్రాక్టర్ కు తాళం తో పాటు పూర్తి బాధ్యతలు అప్పగించామని ఏం జరిగింది అనే దానిపై పూర్తి విచారణ చేపడుతున్నామని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారా అని ప్రశ్నిస్తే లేదని ఇంటర్నల్ గా విచారణ చేపడుతున్నామని వెల్లడించారు. ఇంత పెద్ద ఆసుపత్రిలో ఆసుపత్రి సామాగ్రికే రక్షణ లేకపోతే పేషెంట్లకు, వారి సామాగ్రికి ఎలా రక్షణ ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :