Friday, 25 September 2026 09:53:35 PM

నేత్రదానం చేసిన ఆదర్శ రైతు..!

Date : 04 October 2022 09:08 PM Views : 570

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : మరణించినా మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించి పలువురికి ఆదర్శంగా నిలిచారు.. పెద్దపల్లి జిల్లా గడ్డంపల్లి(సుందిల్ల) గ్రామానికి చెందిన గడ్డం సదానందం(41) అనే రైతు. గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్న సదానందం జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు భీష్మాచారి, పాలకుర్తి మండలం కన్వీనర్ పృథ్వి రాజ్ తదితరులు మృతుని కుటుంబ సభ్యులకు నేత్రదానం పై కౌన్సిలింగ్ ఇచ్చారు. సదానందం నేత్రాలను దానం చెయ్యాలని కోరగా, స్పందించిన మృతుని భార్య సునీత, తల్లిదండ్రులు గట్టమ్మ, రాములు విషాద దుఃఖం లో కూడా నేత్రదానం చేయడానికి అంగీకరించారు. దింతో ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ మేనేజర్ కృష్ణా రెడ్డి సిబ్బంది సహాకారంతో సదానందం నేత్రాలను సేకరించారు. మరణించినా ఆయన చూపు సజీవంగా ఉండాలని, మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించిన కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు టి.శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ భీష్మాచారి, ప్రతినిధులు రాజమౌలి, వాసు, అన్నపూర్ణ, లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాజెందర్ తదితరులు అభినంధించారు. సదానందం మృతిపట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :