Wednesday, 12 February 2025 03:32:47 AM

కోటి ఆసుపత్రి సూపరిండెంట్ అధికార దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలి

గోల్నాక డివిజన్ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు సయ్యద్ జోహరుద్దీన్ డిమాండ్

Date : 14 February 2024 04:58 PM Views : 155

ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సుల్తాన్ బజార్ కోటి ఆసుపత్రి సూపరిండెంట్ డా. రాజ్యలక్ష్మి చేస్తున్న అధికార దుర్వినియోగం ఆగడాలు సిబ్బంది వేధింపులపై సమగ్ర విచారణ జరిపించాలని గోల్నాక డివిజన్ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు సయ్యద్ జోహరుద్దీన్ డిమాండ్ చేశారు.తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తూ నిమ్స్ లో అడ్మిట్ అయినప్పుడు డ్యూటీలో ఉన్న డాక్టర్ రాజలక్ష్మి కేసీఆర్ కు ఆ సమయంలో సపోర్ట్ చేశారని అన్నారు. కేసీఆర్ వారి కుటుంబ సభ్యులను మంచిగా చేసుకొని ఆసమయంలో కేసీఆర్ తో దిగిన ఫోటో తన వద్ద పెట్టుకొని అదే ఫోటో ప్రగతిభవన్ లో ఉన్నదని చెప్పి దానిని ఆసరాగా చూపి అవినీతికి పాల్పడుతూ సిబ్బందిని బెదిరిస్తూ నాన దుర్భాషలాడుతూ న్నారని విమర్శించారు. గత ప్రభుత్వ సపోర్టుతో అనేక రకాలుగా ఇష్టానుసారంగా అక్రమాలకు పల్పడుతున్నాట్లు ఆరోపించారు.ఆస్పత్రిలో అవినీతి తారస్థాయిలో పెరిగి పర్మినెంట్ ఉద్యోగులను అణచివేస్తూ ప్రైవేటు ఉద్యోగులతో లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఆసుపత్రి సూపరిండెంట్ ఒక నియంతగా ప్రవర్తిస్తుందని ప్రధానంగా లేబర్ రూమ్ ఆపరేషన్ థియేటర్ వద్ద డెలివరీ అయిన పేషెంట్ దగ్గర మగ పిల్లవాడు పుడితే 3000 ఆడపిల్ల పుడితే 2000 కాగా ఓపి రిజిస్ట్రేషన్ వద్ద ఒక చీటీ కొరకు 50 నుండి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రోగులు ఆస్పత్రి లోపలికి వెళ్లాలంటే కొందరు సెక్యూరిటీ గార్డులు నానా అవస్థలు పెడుతున్నారని విమర్శించారు. అలాగే లోపలికి వెళ్లాలంటే 50 నుంచి వంద రూపాయలు సమర్పించాల్సిందే అని ఈ ఆస్పత్రిలో జరిగే ప్రతి సేవకు ఒక ధరలను ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. దీని కొరకు ప్రత్యేకంగా ఆ సూపరిండెంట్ ఇద్దరు సూపర్వైజర్లను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు అవుట్సోర్సింగ్ సెక్యూరిటీ సిబ్బందిని మధ్య మధ్యలో ఉద్యోగం నుంచి తీసివేస్తూ డ్యూటీలో చేర్చుకోవడానికి పది నుండి 20వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.

గత ప్రభుత్వంలో ఆడిందే ఆట పాడిందే పాట..

గతంలో జరిగిన ఫార్మసీ ఆక్రమణలపై విజిలెన్స్ వాళ్ళు ఎంక్వయిరీ జరిపిన ఇప్పటివరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదని, ఒక పురాతన ఆసుపత్రిని కూలగొట్టి దాని స్థానంలో కొత్త ఆసుపత్రిని నియమించారని అన్నారు. కొలగొట్టిన పాత సామాన్లు, పాత ఫర్నిచర్ లు, కంప్యూటర్స్ తరలించినట్లు తెలిసిందని.కావున నేను ఈ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ రాజ్యలక్ష్మి పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీనిపై తక్షణమే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు