Thursday, 24 September 2026 04:14:08 PM

కరీంనగర్ కలెక్టర్ కు ఖమ్మం మంత్రి క్షమాపణ చెప్పాలి.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కాంగ్రెస్ నాయకుల అహంకారానికి పరాకాష్ట ఈ ఉదంతమే నిదర్శనం..

Date : 25 January 2025 09:59 AM Views : 922

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : కరీంనగర్ కలెక్టర్ కు ఖమ్మం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేసారు. కరీంనగర్ జిల్లాలో శుక్రవారం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పలు అభివృద్ధి కార్యక్రమాల పర్యటనలో భాగంగా హోసింగ్ బోర్డు కాలనీలో 24 గంటల నీటి సరఫాను ప్రారంభిస్తుండగా పోలీసులు పదేపదే రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నెట్టివేస్తున్న క్రమంలో అక్కడే ఉన్న మహిళా కలెక్టర్ ప్రమేలా సత్పతిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాట్ ఈజ్ దిస్, ఎక్కడ మీ కరీంనగర్ పోలీస్ సూపరిండెంట్ అంటూ అసహనం వ్యక్తం చేయడంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కరీంనగర్ కలెక్టర్ ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవమానించడాన్ని ఖండించారు.కాంగ్రెస్ నాయకుల అహంకారానికి పరాకాష్ట ఈ ఉదంతమే నిదర్శనం అని విమర్శించారు.ఇలాంటి సిగ్గుమాలిన వైఖరి ఆమోదయోగ్యం కాదన్నారు.ఇది కేవలం కలెక్టర్ ను అవమానించడమే కాదు... మొత్తం అధికార యంత్రాంగాన్నే అవమానించినట్లు అని పేర్కొన్నారు.మహిళా కలెక్టర్ కి మేము అండగా ఉంటామని తెలిపారు.మంత్రి పొంగులేటి, కాంగ్రెస్ పార్టీ మహిళా కలెక్టర్ కు తక్షణమే క్షమాపణలు చెప్పాలనిన్ ఒక్క ప్రకటనలో డిమాండ్ చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :