ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెనుగొండ సతీష్ : శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో బాసర క్షేత్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ సమీపములో శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమము( కోటి పార్థివలింగ స్తూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము ) మాసో త్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమములు, అధ్యాత్మిక ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవం గా జరిగినవి. ముందుగా దీపారాధన,కలశస్థాపన, పుణ్యాహవచనము ,లక్ష్మీ గణపతి, వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య, కోటి పార్థివ లింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగములకు మహా రుద్రాభిషేకము , కుంకుమార్చన ,గణపతి, నవగ్రహ ,రుద్ర ,సరస్వతి హోమములు, భూదాన సంకల్ప పూజ, మరియు అన్నదానము ఘనంగా జరిగింది..సాంస్కృతిక కార్యక్రమములో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన , నాట్య గురువులు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ దత్త కుచిపూడి అకాడమివ్యవస్థాపక అధ్యక్షులు , స్నేహ రామ్ చందర్, శ్రీ సిద్ధింద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ అకాడమి వ్యవస్థాపక అధ్యక్షులు గౌతమి, మహబూబ్ నగర్ వాస్తవ్యులు నాట్యం అకాడెమి వ్యవస్థాపక అధ్యక్షులు మౌనిక రెడ్డి శిష్య బృందం చేసిన నాట్య ప్రదర్శన శ్రోతలను ఆకట్టుకున్నది. ఈ సందర్భమూ గా ఈ ముగ్గురు నాట్య గురువులకు*ఉత్తమ సాంస్కృ తిక నాట్య సేవా పురస్కారము* శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి వ్యవస్థాపక అధ్యక్షులు శివ శ్రీనిర్మల సంధ్య అంబికానాథ శర్మ దంపతులు అందజేసినారు. ఉత్తమ సాంస్కృతిక నాట్య సేవ పురస్కార గ్రహీతలు సభలో మాట్లాడుతూ బాసర సరస్వతి క్షేత్రము లో ఈ పురస్కారం తీసుకోవడము ఆనందము గా మరియు గర్వము గా ఉన్నదని మరియు బాసర సరస్వతి దేవాలయం సన్నిధి లో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రతి నెల మాసోత్సవము భాగము గా పూజ కార్యక్రమములు, సంగీత, సాహిత్య,నృత్య, ధార్మిక , ఆధ్యా త్మిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని ప్రశంసించారు. ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు శివశ్రీ నిర్మల అంబికానాథ శర్మ సభలో మాట్లాడుతూ ఫిబ్రవరి 5 ,6,7 తేదీలలో న బాసర సరస్వతి క్షేత్రము లో శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్ర మ తృతీయ వార్షి కోత్సవము మరియు శ్రీ మేథా దక్షిణామూర్తి ప్రతిష్ఠ కార్యక్రమము సందర్భమూ గా భరత నాట్య, కూచిపుడి నాట్య ప్రదర్శనలు నిర్వహించనున్నా మని ఆసక్తి గల నాట్య గురువులు 9948332032 ఈ నెల 23 లోపు సంప్రదించి మీ సంస్ధ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ వాస్తవ్యులు వెంకటేష్, చంద్రశేఖర్,మడిపల్లి యం. ప్రసాద్, కామర్సు లింగమూర్తి,బాల్రాజ్ ,గాదె ప్రదీప్ గంగ దంపతులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News