Thursday, 24 September 2026 08:52:43 PM

ఆత్మహత్యలు కాదు.ఎమ్మెల్యే ప్రభుత్వ హత్యలు..

అఖిల పక్షం నుండి తప్పుకుంటున్నాం...

Date : 20 October 2022 12:06 PM Views : 1085

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం ఎరువుల కర్మాగారంలో ప్రాణాలు కోల్పోయిన బాధితులది ఆత్మహత్యలు కావని ఎమ్మెల్యేకు సంబంధించిన ప్రభుత్వ హత్యలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మండిపడ్డారు. ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...అఖిల పక్షం ద్వారా బాధితులకు న్యాయం జరగదని భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. బాధితులకు న్యాయం చేయడానికి బాధితుల పక్షాన అఖిలపక్షం నుండి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. 795 మంది బాధితులకు న్యాయం చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆర్ ఎఫ్ సీ ఎల్ బాధితులకు కమిటీ వేశారని కానీ బాధితులకు న్యాయం కమిటీ ద్వారా ఎటువంటి న్యాయం జరగదనే ఉద్దేశంతోనే అఖిలపక్షం నుండి సిపిఐ పక్షన తప్పుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. బాధితులకు సంబంధించిన డబ్బులను అసలు స్టార్ కంపెనీకి ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించారు. ఇప్పటినుండి బాధితులకు డబ్బులు ఇచ్చే వరకు వారి ఇండ్లలోకి వెళ్లి పాదయాత్రను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే వన్ టైం సెటిల్మెంట్ కింద బాధితులకు వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధితుల వద్ద నుండి డబ్బులు తీసుకొని అధికార పార్టీ నాయకులు చేస్తున్నారని. రామగుండం ఎమ్మెల్యే తనకు తాను తప్పించుకోవడానికే అఖిలపక్షం కమిటీ వేశారని ఆరోపించారు. అలాగే బాధితులకు న్యాయం చేయడం కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ తిరగడం తమకు నచ్చడం లేదని డబ్బులు వసూలు చేసిన ఎమ్మెల్యే బినామీల ఆస్తుల జట్టు చేసిన సరే బాధితులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇకమీదట ఆ రేపు సర్ బాధితులు ఎవరైనా రేపటి నుండి భాస్కర్ రావు భవన్ కు రావాలని పిలుపునిచ్చారు. దీనిపై జిల్లా నాయకత్వంతో చర్చించి బాధితులకు న్యాయం చేసేందుకు ముందుకు సాగుతామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యులు గోశిక మోహన్. నగర కార్యదర్శి కనకరాజ్. సహాయక కార్యదర్శి మద్దెల దినేష్, తాళ్లపల్లి మల్లయ్య. ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు మార్కపూరి సూర్య. మహిళా నాయకురాలు విజయలక్ష్మి. పడాల కనకరాజు. చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :