Tuesday, 11 August 2026 05:43:38 PM

వ్యూహాత్మక రాజకీయ చదరంగం

ఆశావాహుల కట్టడికా..? సిట్టింగ్ లకు చెక్ పెట్టడానీకా..?

Date : 26 August 2023 07:45 PM Views : 725

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : నాణేనికి బొమ్మ, బొడుసు ఎలాగానో రాజకీయం కూడా అలాగే ఉంటుంది. ఎవరికైనా బిజ్జగించాలన్నా లేక వ్యతిరేక విధానాలను అడ్డుకట్ట వేయాలన్న రాజకీయాల్లో తమ మేదో శక్తికి పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రస్తుతానికి తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు ఇదేవిధంగా కొనసాగుతున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 115 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. అయితే కొన్నిచోట్ల చాలావరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ అవకాశాన్ని కల్పించారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో సెట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసమ్మతినేతలు తమ గళం విప్పుతున్నారు. అయితే దీనిని అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు పలువురు మేధావులు భావిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రకటించిన అసెంబ్లీ స్థానాల్లో పదిమంది ఎమ్మెల్యేలను మార్చుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. అయితే ఈ మార్పుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పదిమంది ఎమ్మెల్యేల మార్పు విషయంలో పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను మార్చుతున్నట్లు ప్రచారం జరగడం వెనుక ఆంతర్యం ఏమిటనే సందేహాల వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆశావాహులు గళం విప్పడంతో పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం తో పార్టీకి నష్టం జరుగుతుందనే ఆలోచనకు వచ్చిన అధిష్టానం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీఫామ్ రాదని, వారిని మార్చే ఆలోచన ఉన్నట్లు ప్రచారం చేయడం ద్వారా స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఉన్న ఆశావాహులను కట్టడి చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలనే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే స్థానిక ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వారిని మార్చి ఆస్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం ముందుగానే స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చెప్పితే పార్టీతో పాటు స్థానికంగా క్యాడర్ కోల్పోవలసి వస్తుందనే ఆలోచనలతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధిష్టానం నియోజకవర్గాల్లో పట్టు సాధించినందుకు ఆశావాహులను, సెట్టింగ్ ఎమ్మెల్యేలను తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో సెట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు ఆశావాహులు చివరి వరకు పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తారని చివరి సమయంలో ఎటువంటి అవకాశం లేకుండా ఉండడంతో పార్టీలోనే కొనసాగుతారని ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసిన పెద్దగా పార్టీ మీద ప్రభావం ఉండగానే ఉద్దేశంతో ఆచితూచి అధిష్టానం అడుగులు ముందుకేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఏమైనా రాజకీయాల్లో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అనేదానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :