ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంచిర్యాల జిల్లా : తీర్యానీ మండలంలోని సుంగాపూర్ గ్రామానికి చెందిన ఐలవేణి మల్లేష్ 35 అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు . తీర్యానీ ఎస్ఐ సుంచు రమేష్ కథనం ప్రకారం మృతుని భార్య గత తొమ్మిది సంవత్సరాల క్రితం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా ఆమె బంధువులు అప్పట్లో ఆమె మృతికి భర్త మల్లేష్ కారణమని తీర్యాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదయింది. కాగా ఈ కేసు త్వరలో విచారణకు రాను ఉండడంతో తనకి ఎక్కడ శిక్ష పడుతుందోనని భయాందోళనలకు గురై మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అన్నారు. మృతుడి తల్లి ఐలవేణి మల్లక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Admin
Aakanksha News