ఆకాంక్ష న్యూస్ - తెలంగాణ / నాగర్‌కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో గురువారం సినీ హీరో విజయ్ దేవరకొండ సందడి చేశారు. స్థానిక రాణి ఇందిరాదేవి పాఠశాల,కళాశాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రొఫెసర్లు, డాక్టర్లు,బిజినెస్ ఐకాన్, ఉపాధ్యాయులు చదువుకొని ఒకే చోట కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని విజయ్ దేవరకొండ అన్నారు.చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా గత జ్ఞాపకాలను నెమరుసుకుంటూ ఒక వేదికను ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి, మంత్రి తనయుడు జూపల్లి రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News